ATP: గుత్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ పట్టణాధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుత్తి టీడీపీ మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు.