W.G: సోమవారం భీమవరం కలెక్టరేట్ నందు మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మళ్లీ మళ్లీ ఫిర్యాదులు రాకుండా ప్రజలు సమర్పించే వినతులకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.