VZM: జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించి వారి నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది విజ్ఞాపనలు పరిశీలించిన జిల్లా ఎస్పీ, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.