VZM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పొలం పిలుస్తోంది పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి మంగళ, బుధవారాల్లో పొలంబాట పట్టాలని, పంటల సాగు పై చర్చలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖలు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలన్నారు.