GNTR: రాష్ట్రంలోని పొగాకు రైతులకు 2023-24 ఆర్థిక ఏడాదిలో రూ.6,313.58 కోట్ల ఆదాయం లభించిందని భారత పొగాకు బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్ తెలిపారు. గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 215.35 మిలియన్ కిలోల నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయడంతో రికార్డు స్థాయిలో సగటున కిలోకి రూ.288.65 ధర లభించిందన్నారు.