VSP: విశాఖ మీదుగా గోవుల అక్రమ రవాణా చేస్తున్న పలు రవాణా వాహనాలను సీజ్ చేయాలని, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయాలని డీటీసీ ఆదినారాయణను గో సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు జీవ బంధు లోగిన రామకృష్ణ బుధవారం వినతి అందజేశారు. ఈ సందర్భంగా డీటీసీ ఆదినారాయణ స్పందించి పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి అటువంటి వారి వాహనాలు సీజ్ చేస్తామని అన్నారు.