E.G: ఏజెన్సీలో వాగులు పొంగి ప్రవహిస్తున్నందున పర్యాటకులకు అనుమతి లేదని సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. మారేడుమిల్లి, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో అన్ని టూరిస్ట్ ప్రాంతాలను మూసివేయాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వాగుల ఉద్ధృతి తగ్గేవరకు ఎవరూ రావొద్దని కోరారు. స్థానికులు వాగులు దాటే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.