అనంతపురం: ధర్మవరం రెవిన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం అరవింద నగర్‌లోని నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం పరిచయం చేసుకున్నారు.