ATP: ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు రాప్తాడు ఎమ్మెల్యే తనయుడు పరిటాల శ్రీరామ్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మంచూ ఫెర్రర్, ఐసీడీఎస్ పీడీ డా. బీఎన్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.