కృష్ణ: నేడు పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు తెలిపారు. తాత్కియ బైతుల్ మాల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉచిత కంటి పరీక్ష శిబిరం పట్టణంలోని రంగు బజార్ సైదా సాహెబ్ మాస్టర్ నివాసం వద్ద నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని స్థానికులు వినియోగించుకోవాలని కోరారు.