ELR: కొయ్యలగూడెం మండలం రాజావరంలో సోమవారం సచివాలయం వద్ద నిర్వహించే గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొంటారని మండల అభివృద్ధి అధికారిణి మంగాకుమారి తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.