W.G: పెంటపాడు మండలంలోని అలంపురం వెంకటరమణసేవా ఆస్పత్రిలో గురువారం ప్రత్యేక వైద్యులు రానున్నట్లు ట్రస్టు ప్రతినిధి కొలనువాడ పెదకృష్ణంరాజు తెలిపారు. రాజమండ్రి రాజానగరంకు చెందిన కార్డియాలజీ, గైనకాలజీ, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు, అంకాలజీ, జనరల్ మెడిసన్ వైద్యులు పరీక్షలు చేస్తారన్నారు. పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.