GNTR: 132కేవీ విద్యుత్ లైన్ మరమ్మత్తుల కారణంగా నీరుకొండ గ్రామ పరిధిలో శని, ఆదివారాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ నెల 26, 27తేదీల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని నీరుకొండ గ్రామస్తులు గమనించాలని కోరారు.