సత్యసాయి: నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో డ్వామా, డీఆర్డీఏ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, స్కిల్ డెవలప్మెంట్, గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వికసిత్ ఆంధ్ర-2047లో భాగంగా వంద రోజుల్లో చేపట్టే పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.