KKD: బాణసంచా తయారీదారులు, విక్రేతలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ హెచ్చరించారు. ఆదివారం నిర్వహించిన విలేకరి సమావేశంలో కృష్ణ భగవాన్ మాట్లాడుతూ.. పూర్తి భద్రతా ప్రమాణాలు లేకుండా బాణాసంచా తయారీ చేస్తే కేసులు తప్పమన్నారు. బాణాసంచా సామాగ్రి అమ్మకాలకు కూడా పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు ఉండాలన్నారు.