ELR: నవంబర్ 3న విజయవాడలో జరగనున్న వక్ప్ పరిరక్షణ మహాసభకు ఉంగుటూరు మండలం నుంచి ముస్లిం సోదరులు భారీగా తరలిరావాలని చేబ్రోలులోని మదీనా మసీదు కమిటీ అధ్యక్షుడు షా మహమ్మద్ హుస్సేన్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వక్ప్ పరిరక్షణ ముస్లింల బాధ్యత అన్నారు. జమాతే ఇస్లామిక్ ఆధ్వర్యంలో విజయవాడలోని కుమ్మరిపాలెం ఈద్గా మైదానంలో జరుగుతుందన్నారు.