GNTR: కడప డీఎస్ఏ స్టేడియంలో నవంబరు 10 నుంచి అగ్నివీర్ ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆర్మీ నియామక అధికారి కల్నల్ పునీత్ కుమార్ పేర్కొన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్ తదితర నియామకానికి దరఖాస్తులు చేసుకుని అడ్మిట్ కార్డులు పొందిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అర్హులైన అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.