KDP: రైల్వేకోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ముక్కరూపానంద రెడ్డి శుక్రవారం దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.