ATP: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సోమవారం తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం నుంచి మడకశిర వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో రోద్దం మండలానికి చెందిన ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. గమనించిన ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు రోద్దం మండలానికి చెందిన నాగరాజు, దేవరాజుగా గుర్తించారు.