ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు గురువారం ఉదయం 6 గంటలకే పట్టణంలో సచివాలయ సిబ్బందితో కలిసి భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి పింఛన్ దారునికి చంద్రన్న ప్రభుత్వంలో ఒకటో తేదీన పింఛన్ అందించడం జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.