GNTR: తెనాలిలోని ఇండోర్ స్టేడియంలో శనివారం రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలను శాప్ ఛైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అమరావతి వేదికగా క్రీడలను ప్రోత్సహించేందుకు తగిన కార్యాచరణలు రూపొందిస్తున్నామని తెలిపారు.