TPT: తిరుమల శ్రీవారి అపర భక్తుడైన భక్త కనకదాసు విగ్రహాన్ని తిరుపతిలో ఏదో ఒక కూడలిలో ఏర్పాటు చేయాలని కురుబ కుల సేవా సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆ సంఘం అధ్యక్షుడు మంగిరీ రెడ్డెప్ప మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వమే చొరవ తీసుకుని ఏటా భక్త కనకదాసు జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.