VSP: కొయ్యూరు మండలం తీగలమెట్ట గ్రామంలో వెలసిన తలుపులమ్మ తల్లి ఆలయానికి, నడింపాలెం గ్రామానికి చెందిన పందల శివ, వరుణ్, గోవిందులు రూ.50వేల విలువైన మేళతాళాలు, మైక్ సెట్‌ను వితరణ చేశారు. విజయదశమిని పురస్కరించుకుని శనివారం వారు ఆ సామాగ్రిని ఆలయంలో గ్రామస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నానాజీ, పాలపర్తి సత్యానందం, సత్యనారాయణ, తీగలమెట్ట గ్రామస్తులు పాల్గొన్నారు.