ప్రకాశం: కనిగిరి ఆర్ టి సి డిపోను శుక్రవారం కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ సందర్శించారు. డ్రైవర్స్, కండక్టర్ లతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిపో పరిసరాలను పరిశీలించి ప్రయాణికులకు మంచి సౌకర్యాలు అందించేందుకు డిపో అభివృద్ధికి పురపాలక సంఘం ద్వారా ఎలాంటి సహాయం కావాలన్న మున్సిపాలిటీ అధికారుల ద్వారా అందిస్తామని తెలిపారు.