KRNL: ప్రధాన రోడ్లలో దుకాణాలకు ముందు అక్రమ నిర్మాణాలు చేపట్టి వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగించొద్దని ట్రాఫిక్ సీఐ సుబ్బారావు సూచించారు. శుక్రవారం ఆదోనిలోని పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి తిక్కస్వామి దర్గా వరకు దుకాణాలకు ముందు, రోడ్డుకు ఇరువైపులా ఉంచిన సామగ్రిని తొలగించారు. వాహనాలను తనిఖీ చేసి, రికార్డులు సక్రమంగా లేని వారికి జరిమానా విధించారు.