AKP: టెండర్ పేరుతో పోర్టు హాస్పిటల్కు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని ఆల్ ఇండియా ఫెడరేషన్ కార్యదర్శి జగన్, సీఐటీయూ గౌరవ అధ్యక్షులు పద్మనాభ రాజు హెచ్చరించారు. విశాఖ పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం పోర్టు హాస్పటల్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటీకరణ నిర్ణయం అనైతికమన్నారు. తాము చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు ఇవ్వాలన్నారు.