VZM: విశాఖపట్నం జిల్లా ఇంఛార్జ్ రాష్ట్ర మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి ఇంఛార్జ్‌గా నియమితులైన తరువాత మొదటి సారిగా జిల్లాకి విచ్చేశారు. ఈ సందర్బంగా శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సర్క్యూట్ ఆఫీస్‌లో సోషల్ వెల్ఫేర్ మరియు సచివాలయ సెక్రటరీస్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు.