కృష్ణా: గుడివాడ పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి కాలనీ, టీడ్కో కాలనీకి చెందిన పలువురు శుక్రవారం జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.