GNTR: గ్యార్మి జెండా పండుగ సందర్భంగా పొన్నూరు పట్టణంలోని 25వ వార్డులో శనివారం జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హిందూ, ముస్లిం సోదరులు సమైక్యంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం అనవాయితీగా వస్తుందన్నారు.