ప్రకాశం: సూర్యలంక బీచ్‌లో గుంటూరు కొత్తపేటకు చెందిన యువకుడు కళ్యాణ్ గల్లంతయ్యాడు. ఆదివారం సముద్ర స్నానానికి గుంటూరు నుంచి సూర్యలంక బీచ్‌కి స్నేహితుడితో వచ్చారు. స్నానం చేసే సమయంలో ఒక్కసారిగా అలల ఉధృతి పెరగడంతో యువకుడు గల్లంతయ్యాడు. చివరికి మృతుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.