ATP: కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షానికి చిత్రావతి నదిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని పరగోడు డ్యాం దాదాపు 80 శాతం నిండినట్లు తెలిసిందని అన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదకు చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉంది అన్నారు.