AKP: ఉచిత గ్యాస్ విధివిధానాలను ప్రభుత్వం పరిశీలించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు శుక్రవారం నక్కపల్లిలో కోరారు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో 48 గంటలు, పట్టణ ప్రాంతాల్లో 24 గంటలకు గ్యాస్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వమే నేరుగా గ్యాస్ ధర చెల్లించాలన్నారు.