కృష్ణ: పమిడిముక్కల మండలం గురజాడ హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మచిలీపట్నం నుంచి విజయవాడ వైపుకు బైకుపై వెళ్తున్న వ్యక్తికి కుక్క అడ్డు రావడంతో కింద పడిపోయినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.