ALR: జిల్లాలో గంజాయి నియంత్రణకు సహకరించాలని ఎస్పీ అమిత్ బర్దార్ గ్రామ సచివాలయ మహిళా పోలీసులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు, జీ.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు తదితర మండలాలకు చెందిన 110 మంది కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గంజాయి వల్ల జిల్లాకు చెడ్డపేరు వస్తుందన్నారు.