PPM: జిల్లాలో క్రీడా సముదాయం ఏర్పాటుకు స్థలాన్ని మన్యం జిల్లా కలెక్టరు ఏ. శ్యామ్ ప్రసాద్ కేటాయించినట్లు తెలిపారు.సీతానగరం మండలం జోగింపేట వద్ద 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు సీతానగరం తహసీల్దార్ ఏ. ఉమామహేశ్వరరావు స్థలాన్ని క్రీడా ప్రాధికార సంస్థకు శనివారం అప్పగించారు. క్రీడా సముదాయం ఏర్పాటుకు స్థలం కేటాయించిన కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.