CTR: పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కోట పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయం వారి సహకారంతో కోట మండలం కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పా టు చేశామని మేనేజింగ్ డైరెక్టర్ చాగణం గౌరిశంకర్, సీఈవో సీతారామ్ నాయుడు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.