NLR: కావలిలో బాలుడు మిస్సింగ్ కేసు వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన సీఐ కే.శ్రీనివాసరావుపై జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ వేటు వేశారు. ఈయన్ను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో మరికొంతమంది సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన స్థానంలో 2వ నగర సీఐగా వి. గిరిబాబును నియమించారు.