EG: పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం కడియం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, దక్షిణ మండల డీఎస్పీ ఎస్.భవ్య కిషోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసులు దర్యాప్తు, వివిధ కేసులు దర్యాప్తు , క్రైం రికార్డులను పరిశీలించారు.