KDP: అటవీ ప్రాంతంలో సీకే దిన్నే మండలం వద్ద 11 ఎర్రచందనం దుంగలు, ఒక కారు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మద్దిమడుగు అటవీ ప్రాంతంలో కారులో కొందరు ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా చుట్టుముట్టి ముగ్గురిని పట్టుకోగా మిగిలిన వారు పారిపోయారని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.