KRNL: కౌతాళంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు సోమవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా యస్ ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శిగా బావిగడ్డ రాము, ఉపాధ్యక్షుడిగా శంఖభేరి ఉలిగయ్య, కోశాధికారిగా పరుశు, ప్రచార కార్యదర్శిగా సురేశ్, సహాయ కార్యదర్శిగా ఆనంద్, తరుణ్, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.