PPM: స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలకు ఈనెల 28న పోలింగ్ జరగనున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. బుధవారం ఎన్నికలపై రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ ఆయన ఛాంబర్ సమావేశాన్ని నిర్వహించారు.