KDP: కడప పట్టణానికి తలమానికంగా నిలిచిన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉర్సు మహోత్సవ వేడుకలకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరుకావాలని శనివారం మత పెద్దలు ఆహ్వాన పత్రం అందజేశారు. ఇప్పటికే ప్రముఖులందరూ ఉర్సు మహోత్సవ వేడుకలకు హాజరుకానున్నారని, తమరు కూడా హాజరైన అల్లా ఆశీస్సులు పొందాలని మత పెద్దలు పేర్కొన్నారు.