SKLM: ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని వెలుగు ఏ.పీ.ఎం. పైడి కూర్మారావు అన్నారు. ఈ మేరకు బుధవారం హిరమండలం స్థానిక మండల సమాఖ్యలో ఎం.ఎం.ఎస్ పాలక వర్గం సమావేశం నిర్వహించారు. స్వయం శక్తి సంఘాలలో మహిళలు కేవలం గ్రూపు రుణాలకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా కూడా బ్యాంకు నుంచి ఉమెన్ లెండ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో రుణాలను పొంది ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.