KRNL: మండలంలోని రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందని కేసీ కెనాల్ ఏఈ జమాల్ వలి వెల్లడించారు. ఎగువ నుంచి వరద నీరు అధికంగా తరలివస్తుండటంతో కుందూ ప్రవాహం 11 వేల క్యూసెక్కుల నీటితో కొనసాగుతోందని తెలిపారు. కుందూ పరిసర ప్రాంత ప్రజలు, తీర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు.