KDP: CM చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణాలకు ఉచితంగా ఇసుక తీసుకు వెళ్ళొచ్చని ఆదేశించిన సిద్దవటం మండలంలో అమలు కాలేదని ట్రాక్టర్ యజమానులు శుక్రవారం MRO మురాద్షావలీకి గ్రామసభలో వినతిపత్రం సమర్పించారు. MRO మాట్లాడుతూ.. గృహ నిర్మాణాలకు ఉచిత ఇసుక పాలసీపై ఎటువంటి సమాచారం అధికారుల నుండి రాలేదన్నారు. పై అధికారుల నుండి వివరాలు తీసుకొని ఉచిత ఇసుక పాలసీపై తెలియజేస్తామన్నారు.