విజయనగరం: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు అన్నారు. రాంబద్రపురం స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనుమతించిన ఇచ్చుక రీచుల ద్వారా ఇసుక సరఫరా చేయాలని సూచించారు. మందు గుండు సామాగ్రి నిల్వ ఉంచరాదని దీపావళి పండుగ వస్తున్న సందర్భంలో లైసెన్సులు లేకుండా షాపులు నడపవద్దని అన్నారు.