సత్యసాయి: తలుపుల మండలం ఉడమలకుర్తి పంచాయతీ ఇందుకూరిపల్లి గ్రామంలో సోమవారం వేపచెట్టుకు పాలు కారుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఉదయం నుంచి వేపచెట్టుకు పసుపు, కుంకుమ రాసి జ్యోతి వెలిగించి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో అధిక సంఖ్యలో వచ్చి వీక్షించారు.