అనంతపురం: జిల్లా కేంద్రానికి సమీపంలోని కొడిమి జగనన్న కాలనిలో శనివారం సీపీఎం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ.. అర్దాంతరంగా ఆగిన ఇళ్ల నిర్మాణాలు తక్షణమే ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఎక్కడ కూడా పూర్తి చెయ్యకుండా వదిలేశారని మండిపడ్డారు.