VZM: వేపాడ మండలం అరిగిపాలెం గ్రామంలో శనివారం పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక సర్పంచ్ దుల్ల సన్యాసమ్మ ఆధ్వర్యంలో రూ.10 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పంచాయతీలో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దుల్ల వెంకట్రావు పాల్గొన్నారు.