NLR: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులందరికీ అపార్ ఐడీ కార్డుల మంజూరు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, కమీషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.